‘ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్‌కు అలవాటు పడి థియేటర్లకు రావడం మానేశారు’.. ఇదీ కొంతకాలంగా సినీ వర్గాలు చెబుతున్నా మాట. దానికి తగినట్లే 2026లో సంక్రాంతి సీజన్ తర్వాత చాలాకాలం పాటు సినిమాలు పెద్దగా ఆడలేదు. అయితే మంచి కంటెంట్ అందిస్తే థియేటర్లకు వచ్చేందుకు తామెప్పుడూ సిద్ధంగానే ఉంటామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇదే విషయాన్ని 2026 సెకండాఫ్ స్పష్టంగా చెబుతోంది. ‘ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు, ఓటీటీల వల్లే థియేటర్ల వ్యవస్థ దెబ్బతింటోంది’ అన్న వాదనలకు టాలీవుడ్ బాక్సాఫీస్ గట్టి సమాధానం చెబుతోంది. కథలో బలం, చెప్పే విధానంలో కొత్తదనం ఉంటే చాలు... ప్రేక్షకులు థియేటర్లను బ్రహ్మరథం పడతారని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. గత రెండు నెలలుగా వరుస విజయాలతో సినిమా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.‘పెద్ది’తో మొదలై ‘ఇరుముడి’ వరకు ఈ బ్లాక్‌బస్టర్ వేవ్ ‘పెద్ది’ విజయంతో ఊపందుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘మా ఇంటి బంగారం’, వైవిధ్యభరిత కథాంశంతో మెప్పించిన ‘లెనిన్’, సరికొత్త ప్రేమకథగా ఆకట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’, కడుపుబ్బా నవ్వించిన ‘కొరియన్ కనకరాజు’, ఎమోషన్స్ మేళవింపుగా వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాలు వరుసగా విజయబావుటా ఎగురవేశాయి. తాజాగా డివైన్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఇరుముడి’ సైతం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని థియేటర్లలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇలా వారానికి ఒక మంచి సినిమా రావడం, అది ప్రేక్షకులను విశేషంగా అలరించడం పరిశ్రమకు సరికొత్త ఊపునిచ్చింది.* డిఫరెంట్ షేడ్స్‌లో అదరగొట్టేసిన మెగాస్టార్.. సంక్రాంతికి ‘కాకా’ రచ్చకంటెంట్కు జైకొడుతున్న ప్రేక్షక దేవుళ్లుఈ విజయాల వెనుక ప్రధానమైన అంశం కంటెంట్ ప్రాధాన్యత. స్టార్ డమ్ కంటే కూడా కథను నమ్ముకుని తీసిన చిన్న, మధ్యతరహా చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. వీకెండ్ వస్తే చాలు ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్స్ బుక్‌మైషో, డిస్ట్రిక్స్ హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. స్టార్ ఇమేజ్‌తో పనిలేకుండా ఒక మంచి ప్రయత్నానికి ప్రేక్షకులు ఇచ్చే మద్దతు ఇండస్ట్రీని ఆకట్టుకుంటోంది. థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చే చిత్రాలను ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తూ బ్లాక్‌బస్టర్ హిట్లుగా మారుస్తున్నారు.గ్లోబల్ సినిమాలతో డబుల్ ధమాకాఒకవైపు బాక్సాఫీస్ వద్ద తెలుగు చిత్రాల హవా కొనసాగుతుండగానే, మరోవైపు అంతర్జాతీయ స్థాయి హాలీవుడ్ చిత్రాలైన ది ఒడిస్సీ, స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే వంటి భారీ చిత్రాలు కూడా సినీ ప్రియులకు అదిరిపోయే అనుభూతిని పంచాయి. వీకెండ్స్‌లో తెలుగు సినిమాలతో పాటు ఈ భారీ ప్రాజెక్టులు కూడా సినిమా హాళ్లను ప్రేక్షకులతో నింపేశాయి.* చిరంజీవి విలన్ అవుతాడని కృష్ణంరాజు అంటే.. లేదు ఇండస్ట్రీకి మొగుడవుతాడని అప్పుడే చెప్పా: మురళీమోహన్‘ టాక్సిక్ ’ పై భారీ అంచనాలుప్రస్తుతం కొనసాగుతున్న ఈ జోరు ఇక్కడితో ఆగేలా లేదు. మున్ముందు రాబోతున్న పాన్ ఇండియా భారీ ప్రాజెక్ట్ ‘టాక్సిక్’తో పాటు పలు ఆసక్తికరమైన మిడ్-రేంజ్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. చిన్న సినిమా అయినా, భారీ బడ్జెట్ చిత్రమైనా కంటెంట్ బలంగా ఉంటే టాలీవుడ్ బాక్సాఫీస్ ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో ఈ ఏడాది స్పష్టమైంది. చాలాకాలంగా సరైన హిట్టు లేక ఇబ్బందులు పడుతోన్న వరుణ్ తేజ్, రవితేజ కంటెంట్‌ని నమ్ముకోవడం వల్లే తాజాగా మంచి విజయాలు అందుకున్నారు. రాబోయే సినిమాలు కూడా ఇదే జోరును కొనసాగిస్తే 2026 సంవత్సరం తెలుగు చలనచిత్ర చరిత్రలోనే బిగ్టెస్ట్ బ్లాక్‌బస్టర్ ఇయర్‌గా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.





