
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటుడు గోవిందాపై (Govinda) ఆయన భార్య సునీతా ఆహుజా (Sunita Ahuja) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్న చందంగా, గోవిందా మతి చెడి ప్రవర్తిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కోమల్ రాణి స్వర్ణకార్ (Komal Rani Swarnkar) అనే నూతన నటితో గోవిందా సన్నిహితంగా మెలుగుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ధనుష్ అభిమాన సంఘం నిర్ణయం.. తమిళనాట హాట్ టాపిక్
కొంతకాలంగా గోవిందా, సునీతల మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పలువురు నటీమణులతో గోవిందాకు సంబంధాలున్నాయంటూ సునీత గతంలో బహిరంగంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయ్యింది. తాజాగా ఓ ఎయిర్‌పోర్టులో కోమల్ రాణి, గోవిందా కలసి వెళ్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీనిపై సునీత మాట్లాడుతూ గోవిందా వ్యవహారశైలిని తప్పుపట్టారు. ‘‘గోవిందా వేరే నటీమణులతో సంబంధాలు పెట్టుకొని నన్ను మోసం చేశారని చెప్పినప్పుడు ఆయన అభిమానులు నన్ను ట్రోల్ చేశారు. ఇప్పుడు వారేం సమాధానం చెబుతారని నేను ప్రశ్నిస్తున్నా. ఈ విషయంపై ఇక నన్నేమీ అడక్కండి. నాకు దీనిపై మాట్లాడేందుకు ఇష్టం లేదు’’ అని సునీత పేర్కొన్నారు. సునీత గతంలో తనపై చేసిన వ్యాఖ్యలపై గోవిందా ఇటీవల స్పందించారు. ‘‘ఆమె నా మీద ఉన్న ప్రేమతోనే నన్ను తిడుతుంది. ఆ తిట్లను కూడా ప్రేమగానే భావిస్తాను. నేను జీవితంలో ఈ స్థాయికి చేరడం వెనుక ఆమె శ్రమ ఎంతో ఉంది. పిల్లలను ఎంతో ప్రేమగా పెంచింది’’ అని అన్నారు.
కూలీ నెం:1, ఆంఖే, హీరో నెం:1, రాజాబాబు, బడేమియా ఛోటేమియా, పార్టనర్ లాంటి సూపర్‌హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు గోవిందా. ముఖ్యంగా ఆయన డ్యాన్స్, కామెడీకి అభిమానులు ఫిదా అయ్యారు. రాజకీయాల్లో చేరి ఎంపీగా గెలిచారు. సునీతా ఆహుజాను 1987లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
అల్లరి నరేశ్ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’
‘పళ్ళ బురుసు’ లాంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు నిర్మాత సుప్రియ యార్లగడ్డ.




