జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాలలో రాహువు, కేతువులను అశుభాలకు సంకేతంగా భావిస్తారు. సూర్యుడిని రాహువు మింగేసినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుందని, చంద్రుడిని కేతువు మింగినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఈ గ్రహణాలు ఏర్పడే సమయాన్ని అశుభానికి ప్రతీకగా భావిస్తారు. పురాణాల ప్రకారం, సూర్య,చంద్రులను రాహు, కేతువులు మింగినప్పుడే గ్రహణాలు ఏర్పడతాయని పండితలు చెబుతారు.
గ్రహణం సమయంలో భూమిపై నేరుగా అతి నీల లోహిత కిరణాలు పడటం వల్ల మనకు చెడు ప్రభావం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఈ సమయంలో దేవాలయంలోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేవాలయాల్లోని విగ్రహాలు తమ శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో దేవాలయాల తలుపులను పూర్తిగా మూసివేస్తారు. హిందూ గ్రంథాల ప్రకారం, గ్రహణాల సమయంలో సూర్య, చంద్రులు అసాధారణ ప్రతికూల శక్తిని విడుదల చేస్తారు. దీంతో ఆలయాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ప్రతికూల ప్రభావం ఆలయంలో ప్రవేశించకుండా తలుపులను మూసివేస్తారు. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి బలహీనపడే అవకాశం ఉంటుందని నమ్ముతారు.
పురాణాల ప్రకారం, అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం చేశారు. ఆ సమయంలో అసురులకు అమృతం దొరుకుతుంది. ఈ విషయం పసిగట్టిన శ్రీహరి మోహినీ అవతారంలో వెళ్లి రాక్షాసులను మాయ చేసి అమృతాన్ని దేవతలకు ఇస్తుంటాడు. ఇది కనిపెట్టిన రాహువు-కేతువులు కూడా సూర్య చంద్రుల మధ్య కూర్చుంటారు. ఇదే విషయాన్ని సూర్య చంద్రులు విష్ణువుకు వివరిస్తారు.
రాహువు, కేతువుల కంఠం వరకు అమృతం చేరి ఉంటుంది. అయితే శ్రీ మహా విష్ణువు వారి శిరస్సులను ఖండిస్తాడు. వారు అమృతం స్వీకరించడంతో వారి తల భాగం అమరత్వంతో ఉండిపోతుంది. వారి శరీరం నశించిపోతుంది. తమ గురించి విష్ణువుకు వివరించిన సూర్య చంద్రులను రాహు, కేతువులు తాత్కాలికంగా మింగేస్తారు. సూర్యుడు, చంద్రుడు కనిపించని ఆ కాలాన్ని చెడు కాలంగా పరిగణిస్తారు. దీంతో రాహువు, కేతువులకు సూర్య చంద్రులుగా మారిపోతారు. అలా సూర్యుడిని రాహువు మింగినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. కేతువు చంద్రుడిని మింగినప్పు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి





