
Aug 10 2026 3:39 PM | Updated on Aug 10 2026 3:45 PM
ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మేజర్ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ 2026 సీజన్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదు. టీమిండియా నుంచి అకస్మాత్తుగా పిలుపు రావడంతో.. సర్ఫరాజ్ ఖాన్ వెస్ట్ జోన్ జట్టును వీడాడు.
కాగా దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్‌కు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్క్లాస్క్రికెట్లో ఇప్పటికే ఐదు వేలకు పైగా పరుగులు సాధించిన ఈ ముంబైకర్.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2024లో ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగపెట్టాడు.
ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. 371 పరుగులు సాధించాడు. అయితే, అదే ఏడాది చివరగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు తర్వాత అవకాశాలు కనుమరుగయ్యాయి. దీంతో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన సర్పరాజ్ ఖాన్.. భారీగా బరువు తగ్గి స్లిమ్‌గా తయారయ్యాడు.
దేశీ క్రికెట్లోనూ మరోసారి సత్తా చాటాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్ల నుంచి సర్ఫరాజ్‌కు పిలుపు రాలేదు. అయితే, శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన సాయి సుదర్శన్ గాయం నుంచి కోలుకోకపోవడం అతడి పాలిట వరంగా మారింది. దీంతో తాజాగా సాయి స్థానాన్ని సర్ఫరాజ్‌తో భర్తీ చేస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియాతో చేరేందుకు సర్ఫరాజ్ ఖాన్ శ్రీలంకకు పయనమయ్యాడు. ఈ క్రమంలో వెస్ట్ జోన్ జట్టుకు అతడు దూరం కాగా.. సెలక్టర్లు జై గోహిల్‌కు పిలుపునిచ్చారు. ఈ విషయం గురించి వెస్ట్ జోన్, ముంబై చీఫ్ సెలక్టర్ రాజేశ్ పవార్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ..
‘‘సర్ఫరాజ్ స్థానంలో గోహిల్‌ను ఎంపిక చేశాము. నిజానికి అతడు స్టాండ్ బై ప్లేయర్‌గా ఉండేవాడు. ఇప్పుడు ప్రధాన జట్టులోకి తీసుకున్నాము. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు’’ అని రాజేశ్ పవార్ పేర్కన్నాడు.
కాగా వెస్ట్ జోన్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కాగా.. షామ్స్ ములానీ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక ఆగష్టు 23 నుంచి సెప్టెంబరు 10 వరకు దులిప్ ట్రోఫీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. మరోవైపు.. టీమిండియా- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.
దులిప్ ట్రోఫీ 2026 సీజన్‌కు వెస్ట్ జోన్ జట్టు (అప్డేటెడ్) రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), షామ్స్ ములాని (వైస్ కెప్టెన్), హర్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), జైమీద్ పటేల్, పృథ్వీ షా, శివాలిక్ శర్మ, సిద్దార్థ్ దేశాయ్, జై గోహిల్, ముషీర్ ఖాన్, అతీత్ షేత్, ముకుశ్ చౌదరి, తనుశ్ కొటియాన్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే.
'హుషారు పిట్టలు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
ఆషిక బర్త్ డే సెలబ్రేషన్స్.. అక్క-బావ సర్ప్రైజ్ గిఫ్ట్ (ఫొటోలు)
హీరోయిన్ హన్సిక బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
CM విజయ్ సంచలనం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
EVM ల మాయాజాలం అడ్డంగా దొరికిన బాబు కూటమి గుట్టు రట్టు
దమ్ముంటే గుడివాడకు రా.. తొక్కి పెట్టాలని చూస్తే...
గర్ల్‌ఫ్రెండ్‌ను గొంతు నులిమి చంపాడని వరుణపై ఆరోపణలు
సుద్దపూస కబుర్లు వద్దు కూటమికి వల్లభనేని వార్నింగ్





