
Sep 2 2026 2:37 PM | Updated on Sep 2 2026 2:37 PM
జూన్ 2026లో 19.7 శాతానికి పెరిగిన స్త్రీల రుణాలు!
భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇటీవల విడుదల చేసిన 2026 జూన్ త్రైమాసిక నివేదిక ప్రకారం, బ్యాంకు రుణాలను పొందడంలో మహిళలు ముందుంజలో ఉన్నారు. జూన్ 2026 నాటికి మహిళా రుణగ్రహీతలకు బ్యాంకులు అందించిన అప్పు గత ఏడాదితో పోలిస్తే 19.7 శాతం రికార్డు వృద్ధిని నమోదు చేసింది. గతేడాది జూన్‌లో ఈ వృద్ధి 12.9 శాతంగా ఉండగా ఈసారి గణనీయంగా పుంజుకోవడం విశేషం.
ఆర్బీఐ గణాంకాల ప్రకారం, దేశంలో మొత్తం బ్యాంక్ రుణ వృద్ధి 16.5 శాతంగా నమోదు కాగా, మహిళా రుణగ్రహీతల వృద్ధి రేటు (19.7%) అంతకంటే అధికంగా ఉండటం గమనార్హం. వడ్డీ రేట్లు తగ్గడం కూడా రుణాలు పెరగడానికి ప్రధాన కారణమైంది. బ్యాంకుల బకాయి రుణాలపై సగటు వడ్డీ రేటు గతేడాది 9.71 శాతం నుంచి 9.26 శాతానికి దిగివచ్చింది. 9 శాతం కంటే తక్కువ వడ్డీకే లభించే రుణాల వాటా 54.1 శాతం నుంచి ఏకంగా 64.1 శాతానికి చేరింది.
మెట్రో నగరాల కంటే కూడా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో రుణాల డిమాండ్ వేగంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 21.1% వృద్ధి, అర్బన్/సెమీ-అర్బన్ ప్రాంతాల్లో 21.4% నుంచి 21.6% వృద్ధి, మెట్రోపాలిటన్ నగరాల్లో 13.1% వృద్ధి నమోదైంది. ఈ గణాంకాలు కేవలం సాధారణ వ్యక్తిగత రుణాలకు మాత్రమే పరిమితం కాకుండా మహిళలు స్వయం ఉపాధి, వ్యాపార వేత్తలుగా నిలదొక్కుకోవడానికి నిధి సదుపాయాలను వినియోగించుకుంటున్నారని స్పష్టం చేస్తున్నాయి. వర్కింగ్ క్యాపిటల్ రుణాలు 18 శాతం చొప్పున పెరగడం దేశీయ ఆర్థిక రంగంలో స్థిరమైన పురోగతికి సంకేతం.
'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)
నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు)
నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో
వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ
ఆపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్ ఐఫోన్ 18..కొత్త డేట్ ప్రీ బుకింగ్ ఆర్డర్ చేసుకోండి
భయపడకండి మీకు నేనున్నా... అంబటి సురేష్ కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్
థియేటర్స్ దందాకు చెక్ Seat వద్దకే ఫుడ్ డెలివరీ..





