
Aug 10 2026 12:26 PM | Updated on Aug 10 2026 12:39 PM
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఐజీఎంసీ)లో ఇది వెలుగు చూసింది. గర్భంలో పెరుగుతున్న ఒక పిండం నోటిలో మరో పిండం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్య పరిభాషలో ఈ అరుదైన పరిస్థితిని ‘ఫెటస్ ఇన్ ఫెటు’ (గర్భంలో పిండం)అని అంటారు. సాధారణంగా ప్రసవం తర్వాత బయటపడే ఈ రకమైన కేసులు, గర్భధారణ సమయంలోనే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా నిర్ధారణ కావడం విశేషం. ఈ కేస్ రిపోర్ట్‌ను వైద్య నిపుణులు ఇటీవల ఒక అంతర్జాతీయ వైద్య పత్రికలో ప్రచురించారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం 20 ఏళ్ల గర్భిణికి 22వ వారంలో నిర్వహించిన సోనోగ్రఫీ పరీక్షలో పిండం దవడలో అసాధారణంగా ఉన్నట్లు వెల్లడైంది. నోటిలో ప్రత్యేక నిర్మాణం కనిపించడంతో వైద్యులు అల్ట్రాసౌండ్, అధునాతన ఇమేజింగ్ పద్ధతుల ద్వారా సమగ్ర పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో నోటిలో ఉన్న ఆ నిర్మాణం 'ఫెటస్ ఇన్ ఫెటు'గా తేలింది. కవలల గర్భధారణ సమయంలో ఒక పిండం సరిగా అభివృద్ధి చెందక, మరొక పిండం శరీరంలో ఉండిపోవడం జరుగుతుంది. అయితే ఇలా నోటి భాగంలో, అది కూడా దవడలో తీవ్రమైన లోపాలతో పరాన్నజీవి పిండం ఏర్పడటం అత్యంత అరుదని వైద్యులు తెలిపారు.
పిండంలో తీవ్రమైన అసాధారణతలు ఉన్నట్లు నిర్ధారించడంతో, గర్భిణి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్యుల సలహా మేరకు చట్టపరమైన ప్రక్రియను అనుసరించి గర్భాన్ని తొలగించారు. ఈ సమస్యను ముందుగానే గుర్తించడం వల్ల తల్లి ప్రాణాలకు ముప్పు తప్పిందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఐజీఎంసీ వైద్యుల ఈ అరుదైన అనుభవం అంతర్జాతీయ వైద్య రంగంలో గుర్తింపు పొందింది. ఇది కూడా చదవండి: ‘విరాళాల గోల్మాల్’ : ప్రధాని నివాసానికి సాధువుల భారీ మార్చ్!
ఆషిక బర్త్ డే సెలబ్రేషన్స్.. అక్క-బావ సర్ప్రైజ్ గిఫ్ట్ (ఫొటోలు)
హీరోయిన్ హన్సిక బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
'టాక్సిక్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
'పాంచాలి పంచభర్తృక' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
పేకాటలో గెలిస్తే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేస్తారా..? నువ్వేం మంత్రివయ్యా
పరిపాలనలో పూర్తిగా ఫెయిల్.. మేము వచ్చాక ఒక్కొక్కడికి..
దద్దరిల్లిన కర్నూల్.. కొట్టినా.. అరెస్ట్ చేసినా YSRCP నిరసనలు