
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Prabhas Surgery News: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌కు సర్జరీ జరిగినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు ప్రధాన కారణంగా ప్రభాస్ ఓ వైద్యుడ్ని కలవడమే. హైదరాబాద్‌లోని ప్రముఖ అపోలో హాస్పిటల్స్‌లో మోకాలు, తుంటి, క్రీడా సంబంధిత గాయాల చికిత్సలో నిపుణులైన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.జె. రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు గ్లోబల్ స్టార్ ప్రభాస్ అభిమానులలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది.
డాక్టర్ రెడ్డి, నటుడు ప్రభాస్‌తో కలిసి దిగిన ఒక ఫోటోను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. అయితే, ఆ ఫోటోతో పాటు ఆయన పెట్టిన సుదీర్ఘ సందేశంలో ప్రభాస్ ఆరోగ్య బాధ్యతను ప్రస్తావించడంతో పాటు ఆయన పడిన "వ్యక్తిగత త్యాగాల" గురించి రాయడం ఈ ఆందోళనలకు ప్రధాన కారణమైంది.
డాక్టర్ రెడ్డి తన పోస్ట్‌లో ప్రభాస్ అద్భుతమైన నిరాడంబరత్వాన్ని కొనియాడారు. "ప్రభాస్ గురించి తెలుసుకోవడం, ఆయన ఆరోగ్య బాధ్యతను స్వీకరించడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అపారమైన విజయం సాధించినప్పటికీ, ఆయన ఎంతో నిరాడంబరంగా, ఆప్యాయంగా, మర్యాదపూర్వకంగా ఉంటారు. ఆయన సానుకూల దృక్పథం, అద్భుతమైన స్వభావం ఆయన్ని నిజంగా ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడతాయి" అని ప్రశంసించారు.
దీనితో పాటు, ఒక విజయవంతమైన స్టార్ హీరో సాధించిన విజయాల వెనుక తరచుగా బయటి ప్రపంచానికి కనిపించని త్యాగాల గురించి కూడా డాక్టర్ ఒక సందేశాన్ని పంచుకున్నారు. "మీరు ఒక విజయవంతమైన వ్యక్తిని చూసినప్పుడు, కేవలం వారి బహిరంగ విజయాలను మాత్రమే చూస్తారు తప్ప, ఆ స్థాయికి చేరుకోవడానికి వారు చేసిన వ్యక్తిగత త్యాగాలను ఎప్పుడూ గమనించరు" అని ఆ ఫోటోపై ఉన్న సందేశం ద్వారా వివరించారు.
డాక్టర్ రెడ్డి ప్రభాస్ మంచి ఆరోగ్యం, సంతోషం, నిరంతర విజయాలను ఆకాంక్షిస్తూ పోస్ట్‌ను ముగించినప్పటికీ, ఆయన "ఆరోగ్య బాధ్యత", "త్యాగాలు" అని రాయడం వల్ల ప్రభాస్‌కు ఏమైనా శస్త్రచికిత్స జరిగిందా అనే కలవరం అభిమానుల్లో నెలకొంది. గతంలో 'బాహుబలి', 'సాహో', 'సలార్' వంటి భారీ యాక్షన్ చిత్రాల చిత్రీకరణ సమయంలో ప్రభాస్ పలుమార్లు గాయపడ్డారు. ముఖ్యంగా మోకాలి సమస్యల వల్ల ఆయన గతంలో రెండుసార్లు శస్త్రచికిత్సలు కూడా చేయించుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన చిత్రీకరణలో కూడా ఆయనకు మరోసారి గాయమైనట్లు సమాచారం ఉంది.
ఈ పోస్ట్ చూసిన అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తూ తమ ఆందోళనతో పాటు కృతజ్ఞతలను వ్యక్తపరుస్తున్నారు. ఓ అభిమాని కామెంట్ చేస్తూ.. "మా హీరోని ఇంత బాగా చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు డాక్టర్. దయచేసి ఆయన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ బాగుండేలా చూడండి" అని వ్యాఖ్యానించారు. మరొకరు "ప్రజలు కేవలం బాక్సాఫీస్ వసూళ్లను మాత్రమే చూస్తారు, కానీ ప్రతి పాత్ర కోసం ప్రభాస్ అన్న పడే శ్రమ, చెమట, అంకితభావం మాకు తెలుసు" అని భావోద్వేగంగా రాశారు.
మరికొందరు "మీ మాటలు ప్రభాస్ అనే అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చక్కగా ఆవిష్కరించాయి. మీ ఆప్యాయమైన మాటలకు ధన్యవాదాలు సార్" అని వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపారు. వృత్తిపరంగా ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్', హను రాఘవపూడి 'ఫౌజీ' చిత్రాలతో పాటు, నాగ్ అశ్విన్ 'కల్కి 2898 AD' సీక్వెల్లో 'భైరవ' పాత్రలో బిజీగా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్టుల నేపథ్యంలో, ఆయన పూర్తి ఆరోగ్యంతో ముందుకు సాగాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కోరుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





