టాలీవుడ్ గ్లామర్ క్వీన్, బుట్టబొమ్మ పూజా హెగ్డేకి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన పురస్కారం లభించింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘనంగా జరిగిన ఓ ప్రత్యేక గాలా వేడుకలో ఆమె పాల్గొనగా, అక్కడ ఆమెను ప్రజా ప్రతినిధులు, నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ మైలురాయిపై పూజా హెగ్డే స్పందిస్తూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
న్యూయార్క్ సిటీ పబ్లిక్ అడ్వకేట్ నుంచి ఈ గౌరవాన్ని అందుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని పూజా తెలిపారు. ఈ ప్రత్యేకమైన వేడుకలో తనను భాగం చేసిన నిర్వాహకులకు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడి ప్రజల నుంచి లభించిన అపారమైన ప్రేమ తనలో మరింత ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు.
తనకు లభించిన ఈ గౌరవంపై స్పందిస్తూ 'ఇది కేవలం ఆరంభం మాత్రమే.. మున్ముందు సాధించాల్సింది చాలా ఉంది' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ శక్తితో మళ్లీ త్వరలోనే పూర్తిస్థాయి 'వర్క్ మోడ్'లోకి వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఒకప్పుడు టాలీవుడ్లో వరుస విజయాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఏలిన పూజా హెగ్డే, స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు. అల వైకుంఠపురములో, అరవింద సమేత వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దశాబ్దకాలం పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేశారు. మధ్యలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, తనదైన గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్‌తో క్రేజ్ కాపాడుకుంటూ వస్తున్నారు.
ప్రస్తుతం పూజా హెగ్డే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రీసెంట్గా తమిళంలో భారీ చిత్రంలో నటించిన ఆమె, ప్రస్తుతం 'కాంచన 4' తో పాటు మరెన్నో క్రేజీ ప్రాజెక్ట్‌లలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.
గ్లోబల్ వేదికపై తమ అభిమాన నటి ఘనత సాధించడంతో పూజ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. 'కంబ్యాక్ క్వీన్' అంటూ కామెంట్స్ చేస్తూ ఈ పిక్స్, వార్తలను ట్రెండ్ చేస్తున్నారు.
త్వరలోనే మరిన్ని పెద్ద ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు రానున్న పూజా హెగ్డే, రాబోయే చిత్రాలతో మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతుందనే నమ్మకంతో ఉన్నారు ఆమె అభిమానులు.
Pooja Hegde, Pooja Hegde New York Honor, Telugu Cinema Actress
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com
Disclaimer : All content on this website, including text, images, videos, graphics, and audio, is the intellectual property of ObjectOne Information Systems Ltd. and/or its affiliates. Any unauthorized reproduction, distribution, modification, or publication of this material, in whole or in part, is strictly prohibited without prior written consent from ObjectOne Information Systems Ltd.




