
Sep 1 2026 2:35 PM | Updated on Sep 1 2026 2:35 PM
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిరసనకారులపై పెల్లెట్ గన్లను ఉపయోగించడం మానవ హక్కుల ఉల్లంఘన కాదని సీఆర్పీఎఫ్ స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కింద టీఎంసీ నేత సాకేత్ గోఖలే అడిగిన ప్రశ్నకు సీఆర్పీఎఫ్ ఈమేరకు సమాధానమిచ్చింది. ఈ విషయాన్ని తాను సుప్రీంకోర్టు ముందుంచుతానని గోఖలే చెప్పారు.
జూలై 20వ తేదీన సీజేపీ పిలుపు మేరకు పార్లమెంట్ వైపు వెళ్తున్న నిరసనకారులపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) జవాన్లు పెల్లెట్ గన్లను వాడారంటూ వచి్చన ఆరోపణలపై సహచట్టం కింద సీఆర్పీఎఫ్కి పంపిన దరఖాస్తును గోఖలే సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘నిరసనకారులపై పెల్లెట్ గన్లు ఉపయోగించడం మానవ హక్కుల ఉల్లంఘన కాదంటూ సీఆర్పీఎఫ్ సమాచారాన్ని నిరాకరించింది. దీనిపై అప్పిలేట్ అథారిటీ కూడా సమాచారాన్ని అందించేందుకు నిరాకరించింది’అని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం నిరసనకారులపై పెల్లెట్ గన్లను ఉపయోగించలేదంటూ మొదట్లో బుకాయించిందని గోఖలే గుర్తు చేశారు.
హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)
కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)
యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)
పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)
జీ న్యూస్ అధినేత సుభాష్ చంద్రకు NCLT షాక్
Viral : 20 సెకన్లలో ఇద్దరిపై కత్తులతో దాడి.. న్యూయార్క్ లో టెన్షన్!
పరారీలో బాసింగ బాసింగ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి




