
© 2026 nimisham.in

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా.. ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు ‘మెగా158’ చిత్ర బృందం సిద్ధమైంది.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు ‘మెగా158’ చిత్ర బృందం సిద్ధమైంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రమిది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ టీజర్‌ను చిరంజీవి జన్మదిన కానుకగా (Chiranjeevi Birthday Special) ఆగస్ట్ 22న అధికారికంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు బాబీ కొల్లి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గ్లింప్స్ విడుదల తేదీని ప్రకటిస్తూ దర్శకుడు బాబీ ఓ పవర్ఫుల్ పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో చిరంజీవి సరికొత్త యాటిట్యూడ్, ఇంటెన్స్ స్వాగ్తో కూడిన సిల్హౌట్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘‘మెగాస్టార్‌కు ప్రత్యేకమైన రోజున ఇన్నాళ్లుగా వెయిట్ చేస్తున్న వెయిటింగ్‌కు ఫుల్స్టాప్ పడనుంది. ఆగస్టు 22న Mega158 టైటిల్ గ్లింప్స్ వచ్చేస్తోంది. ఇదొక న్యూ చాప్టర్.. న్యూ ఫోర్స్.. సరికొత్త మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. మునుపెన్నడూ చూడని రీతిలో సాగే మెగా బ్లాస్ట్‌కు సిద్ధంగా ఉండండి’’ అంటూ బాబీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌తో కలిసి టీజర్ అవుట్‌పుట్ చూస్తున్న వర్కింగ్ స్టిల్‌ను, చిరంజీవి ఇంటెన్స్ సిల్హౌట్ పోస్టర్‌ను విడుదల చేయడంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ సందడి మొదలైంది.
ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’లో చిరును వింటేజ్ మాస్ లుక్‌లో చూపించి మెప్పించిన బాబీ, ఈ సినిమాలో చిరంజీవిని మరో సరికొత్త డైమెన్షన్లో ప్రెజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. శనివారం విడుదల కానున్న టైటిల్ గ్లింప్స్ కోసం మెగా అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఓ వేడుకలో ఈ సినిమా టైటిల్ పై చిరంజీవి ఆల్రెడీ లీక్ ఇచ్చేశారు. ‘కదిరి నరసింహ’, ‘కదిరి నరసింహుడు’ అనే టైటిల్స్ ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. ఫైనల్‌గా మేకర్స్ ఏం టైటిల్ రివీల్ చేయబోతున్నారనేది తెలియాలంటే మాత్రం.. మెగా డే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాను రాబోయే సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
‘మాన్స్టర్’గా సల్మాన్ ఖాన్.. వంశీ పైడిపల్లి స్కెచ్ ఏంటో
‘ఇరుముడి’ దర్శకుడు శివ నిర్వాణతో NSR స్పెషల్ ఇంటర్వ్యూ
సమాజం తిరస్కరించిన వారి జీవితాలపై సినిమా.. టైటిల్ ఇదే
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.