
© 2026 nimisham.in


ISRO Privatisation : ఇస్రో ప్రైవేటీకరణ నిజంగా అవుతుందా? ఉద్యోగుల్లో ఇదే ఆందోళన.. ప్రస్తుత పరిణామాలతో ఇస్రోను ప్రైవైట్ పరం చేయబోతున్నారనే ఊహాగానాలతో ఉద్యోగుల్లో ఆందోళనలను రేకిత్తించింది. ఈ ప్రచారానికి ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణ తెరదించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రైవేటీకరణపై ఆయన సంచలన ప్రకటన చేశారు.
అసలు ఇస్రోను ప్రైవేటీకరించే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. ఇకపై కూడా ప్రభుత్వ సంస్థగానే ఇస్రో కొనసాగుతుందని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. దేశ అంతరిక్ష పరిశోధన, అడ్వాన్స్ టెక్నాలజీ, వ్యూహాత్మక మిషన్లలో సంస్థ కీలక పాత్రను యధావిధిగా కొనసాగిస్తుందని అన్నారు. ఉద్యోగులు, తమ కుటుంబాల్లో నెలకొన్న ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమిదే : ఈ నేపథ్యంలోనే చైర్మన్ నారాయణన్ కీలక వివరణ ఇచ్చారు. ఇస్రోలో దాదాపు 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. వారిలో ఎలాంటి ఆందోళనలు ఉన్నా పరిష్కరించేందుకు సంస్థ చర్యలు తప్పక తీసుకుంటుందని చెప్పారు. ప్రతి సమస్యకు విడివిడిగా రాతపూర్వక సమాధానం ఇవ్వడం సాధ్యం కాదని, ఉద్యోగుల సమస్యలను తప్పక పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఇస్రో భవిష్యత్ పాత్రపై ఉద్యోగ సంఘాల్లో తీవ్రచర్చ మొదలైంది. ప్రస్తుతం ఇస్రో ఆధ్వర్యంలో జరిగే రాకెట్లు, శాటిలైట్లు, ఇతర అంతరిక్ష వ్యవస్థల తయారీని ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపించాయి. దాంతో ఇస్రో ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ఇస్రో చైర్మన్‌ను కోరాయి.
ప్రైవేట్ రంగానికి అవకాశాలు వాస్తవమే :
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.







