మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కొన్నాళ్లుగా గా డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు వాటికి కొనసాగింపుగా వీరి పెళ్లి తేదీ ఫిక్స్ అయిందనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది.అనిరుధ్, కావ్య మారన్ నవంబర్ 10న వివాహం చేసుకోబోతున్నారని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని, ఈ వివాహానికి గ్రీస్ నగరం వేదిక కాబోతోందని తమిళ వర్గాలు చెబుతున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది బంధువులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగనుందని అంటున్నారు.అనిరుధ్ - కావ్య మారన్ కలిసి గ్రీస్ వెళ్లారని, అక్కడ కెమెరా కళ్లకు చిక్కడంతోనే వీరిద్దరి బంధం బయటపడినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అదే గ్రీస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకూ ఇటు కావ్య కానీ, అటు అనిరుధ్ కానీ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. డేటింగ్ రూమర్స్ పై స్పందించలేదు. ఇప్పుడు నవంబర్ 10న పెళ్లి చేసుకోబోతున్నారనే విషయాన్ని ఇరువర్గాలు ధృవీకరించలేదు. ఇది నిజమేనా? ఒట్టి పుకారేనా? అనేది తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించే వరకూ ఆగాల్సిందే.అయితే అనిరుధ్ మామ వైజీ మహేంద్రన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అల్లుడి పెళ్లిపై స్పందించారు. వెడ్డింగ్ చాలా గ్రాండ్ గా జరగబోతోందని కాన్ఫిడెంట్ గా చెప్పారు. జోడీ అదిరిపోయిందని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కావ్య మారన్ పేరు చెప్పకుండానే ఆ అమ్మాయి సాధారణ యువతి కాదని, ఒక పెద్ద టీమ్ ను మెయింటెన్ చేసే కెపాసిటీ ఉందని, తండ్రి జీన్స్ నుంచే బిజినెస్ మెళకువలు వచ్చాయని ఆమెను ఓ రేంజ్ లో పొగిడారు. దీంతో అనిరుధ్ - కావ్య పెళ్లి రూమర్ కాదని, అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రమే రావాలని నెటిజన్లు భావిస్తున్నారు. పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కూతురే కావ్య మారన్. తండ్రి బాటలో వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీమ్ కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కావ్య ఎక్స్ ప్రెషన్స్ కు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి.మరోవైపు అనిరుధ్ సౌత్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ కంపోజర్ గా దూసుకుపోతున్నారు. ఇప్పటికి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుడు ఈయనే. తమిళంతో పాటుగా తెలుగు, హిందీ చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. అనిరుధ్ పేరు పోస్టర్ పై కనిపిస్తే చాలు, ఆ సినిమా ఆడియో రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోతున్నాయి. ఇప్పుడు బక్కోడి మ్యూజిక్ కి అంత డిమాండ్ ఉంది. తెలుగులో ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ మూవీకి వర్క్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘గాడ్ ఆఫ్ వార్’ చిత్రంతో పాటుగా నందమూరి బాలకృష్ణ - కొరటాల శివ సినిమాకి సంగీతం సమకూర్చనున్నారు.





