
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Hero govinda slams on wife sunita Ahuja allegations: కొన్ని రోజులుగా సీనియర్ నటుడు గోవింద, ఆయన సతీమణి సునీతా అహుజాల మధ్య వివాదం పీక్స్ కు చేరింది. ఇటీవల గోవింద చాలా ఏళ్ల తర్వాత నటి కోమల్ రాణిస్వర్ణకార్ తో కలిసి రూప అనే మూవీ తీశారు. దీని ప్రమోషన్ కోసం గోవిందా, రూప తరచుగా కలిసి షోలకు వెళ్తున్నారు. దీనిపై ఇటీవల సునీతా అహుజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రూపకు గోవిందా షూగర్ డాడీ లాంటి వారని విమర్శించింది. అంతే కాకుండా కూతురు వయస్సున్న వారితో గోవిందా ఎయిర్ పోర్టులలో తిరుగుతూ ఏంమెస్సెజ్ ఇస్తున్నారని తీవ్రంగా విమర్శించింది.
ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా తాజాగా.. ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ముఖ్యంగా అమ్మ, అక్క, షుడర్ డాడీ అంటూ సునీతా అహుజా బూతులు వాడటం వెంటనే ఆపాలని బహిరంగంగా హెచ్చరించారు. సునీతా జీ.. ఈ మధ్య మీరు అమ్మా, చెల్లి అంటూ బూతులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. దయచేసి దాన్ని ఆపండి. చాలా మంది సెలబ్రీటీలు మూవీస్ లలో ఇతరులతో కలసి నటిస్తారని చెప్పారు. ఇలా నీచంగామాట్లాడటం మానుకొవాలన్నారు.
మీ నుంచి ఇలాంటి మాటలు ఎక్స్ పెక్ట్ చేయలేదన్నారు. నీ హద్దుల్లో నువ్వు ఉండాలని దయచేసి ఇలాంటి నీచపు ఆరోపణలు చేయోద్దని నటుడు గోవిందా రెండు చేతులు జోడించి మరీ తన భార్యను వేడుకున్నారు. గతంలో నీకు సంబంధించిన కార్యక్రమాల్లో పబ్లిసిటీ కోసం తనను ఉపయోగించుకున్నావని అన్నారు. ఇప్పుడు తన మూవీస్ విషయంలో కల్గజేసుకుని అందరి ముందు ఒక చెడ్డవాడిలో చూపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావని విమర్శించారు.
Read more: Anasuya Bharadwaj: నా మాటలు వక్రీకరించారు.. జై శ్రీరామ్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన అనసూయ భరద్వాజ్.. వీడియో...
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక సునీతా అహుజా ఇప్పటికే.. కోమల్‌ను ఉద్దేశిస్తూ నీ షుగర్ డాడీ చాలా ధనవంతుడు కాబట్టి, నువ్వు మంచి బట్టలు వేసుకొవాలని పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇక రూప మూవీ ప్రమోషన్ల కోసం గోవిందా, కోమల్ రాణితో తరచుగా కన్పిస్తున్న విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





