దర్శకు ధీరుడు రాజమౌళి , సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ అడ్వంచరస్ మూవీ ‘వారణాసి’పై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత జక్కన్న నుంచి వస్తోన్న ఈ ఇంటర్నేషన్ స్టాండర్డ్ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ వెర్సలైట్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మహేష్ కెరీర్లో 29వ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఒక మైండ్ బ్లాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఇండియన్ సినీ వర్గాలు ఊహించని ఒక పవర్ఫుల్ మల్టీస్టారర్ సర్ప్రైజ్ ఉండబోతోందని సమాచారం.* వారణాసి’ నుంచి 'రుద్ర' మాస్ లుక్... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేశ్ బర్త్‌డే పోస్టర్స్ఈ కథలోని త్రేతాయుగం నేపథ్య ఘట్టంలో మహేష్ బాబుని శ్రీరాముడిగా చూపించనున్నట్లు రాజమౌళి ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ద్వారా నెటిజన్లు రాముడిగా మహేశ్ ఎలా ఉంటాడో ఇమేజ్‌లు క్రియేట్ చేసి వైరల్ చేశారు. అయితే రాముడు ఉన్నాడంటే కచ్చితంగా హనుమంతుడు ఉంటాడు కాబట్టి ఆ పాత్ర ఎవరు చేయనున్నారా? అని చాలాకాలంగా ఆసక్తి నెలకొనగా తాజాగా దీనిపై అదిరిపోయే న్యూస్ బయటికొచ్చింది. ఈ ఘట్టంలో అత్యంత కీలకమైన 'హనుమంతుడి'గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. మొదట ఈ రోల్ కోసం మాధవన్ పేరు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, పాత్రలోని తీవ్రతకు చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ సరైన ఎంపిక అని రాజమౌళి భావించినట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్ ఇటీవల ‘పెద్ది’తో తన కెరీర్లోనే సోలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో కుస్తీ సన్నివేశాల్లో ఆయన చూపించిన రౌద్రం, బాడీ లాంగ్వేజ్, డివైన్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ ఇంటెన్స్ అప్పీరెన్స్ నచ్చే రాజమౌళి ఈ ప్రత్యేక పాత్ర కోసం చరణ్‌ను సంప్రదించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్త విజయం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌కు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపు కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. గతంలో 'ఆర్ఆర్ఆర్'లో చరణ్‌ని అల్లూరి సీతారామరాజుగా, క్లైమాక్స్‌లో రాముడి రూపంలో చూపి మెప్పించిన రాజమౌళి ఇప్పుడు ‘వారణాసి’లో ఆయన్ని ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వార్త నిజమైతే మాత్రం ‘వారణాసి’పై అంచనాలు మరింత పెరగడం ఖాయం.* ఐదేళ్ల నిశ్శబ్ద పోరాటం.. నిన్ను చూసి గర్వపడుతున్నా.. కొడుకు విజయంపై నాగబాబు భావోద్వేగంమరోవైపు ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో మహేష్ పోషిస్తున్న 'రుద్ర' పాత్రకు సంబంధించిన రెండు పవర్ఫుల్ పోస్టర్లను విడుదల చేసింది. పొడవాటి జుట్టు, గడ్డంతో రఫ్ అండ్ టఫ్ లుక్‌లో మహేష్ సరికొత్తగా దర్శనమిచ్చారు. ఒక పోస్టర్లో అడవి నేపథ్యంలో సీరియస్ లుక్‌లో కనిపించగా, మరొక పోస్టర్లో వెదురు తెప్పపై పడుకుని శత్రువుల కోసం వేచి చూస్తున్నట్లుగా ఉన్న పిక్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీరాముడిగా మహేష్, హనుమంతుడి పాత్రలో చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే వెండితెరపై అభిమానులకు విజుల్ ఫీస్ట్ అనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించే ఈ కాంబినేషన్ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.





