
‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఇటీవల తెలంగాణ సంప్రదాయ పండుగైన బోనాల ఉత్సవాల్లో పాల్గొనడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొంటోంది.
‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ఇటీవల తెలంగాణ (Telangana) సంప్రదాయ పండుగైన బోనాల ఉత్సవాల్లో (Bonalu Festival) పాల్గొనడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొంటోన్న విషయం తెలియంది కాదు. ఒక వర్గం నెటిజన్లు ఆమె మతాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేయడంతో, వీటన్నింటికీ సమాధానమిస్తూ ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ అవుతూ ఓ వీడియోను పంచుకున్నారు. కన్నీటి పర్యంతమవుతూ ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
ఈ వీడియోలో ఫరియా మాట్లాడుతూ.. ‘‘మా నాన్నగారు ఇస్లాం మతాన్ని ఇష్టపడి అందులోకి మారారు. ఒక మతంలోని మంచిని చూసి స్వీకరించిన వ్యక్తి నన్ను పెంచినప్పుడు, నా పెంపకం ఎలా ఉంటుంది? నేను ఎప్పుడూ ఇస్లాంలో ఉన్న మంచి భావనలనే చూస్తూ పెరిగాను. నన్ను ద్వేషిస్తూ, కాఫిర్ అని, తప్పు చేస్తున్నావని తిడుతున్న వారికి కూడా నేను మంచి జరగాలనే కోరుకుంటున్నాను. నాకు ప్రకృతిలోని చెట్లు, రాళ్ళు, సీతాకోకచిలుకలు.. ఇలా ప్రతి అణువులోనూ ప్రాణం, దైవత్వం కనిపిస్తాయి’’ అని భావోద్వేగానికి గురయ్యారు. (Faria Abdullah Emotional Video)
చిన్నతనంలో తాను ‘అల్లాహ్’ అంటే ఏమిటని తల్లిని అడిగినప్పుడు, ‘అల్లాహ్ అంటే వెలుగు.. అంతటా, ఎల్లప్పుడూ నిండి ఉండే ఒక దివ్యశక్తి’ అని చెప్పారని ఆమె గుర్తుచేసుకున్నారు. అలాంటప్పుడు ప్రతిదానిలో ఉండే దైవాన్ని ఎలా వేరుచేసి చూడగలమని ఆమె ప్రశ్నించారు. ‘‘నేను ప్రేమ, శాంతి, ఐక్యత కోసం మాత్రమే ప్రార్థిస్తాను. నాపై ద్వేషం చూపిస్తున్న వారికి కూడా నా ప్రేమనే పంపుతాను’’ అని ఫరియా స్పష్టం చేశారు. మతపరమైన హద్దులు లేకుండా అన్ని సంస్కృతులను గౌరవించే తన దృక్పథాన్ని ఆమె ఈ వీడియో ద్వారా పంచుకోవడంతో పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
SYG: సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’.. డేట్ ఫిక్స్
అర్జున్ బర్త్డే స్పెషల్.. ‘పొలిమేర 3’లో పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Fauzi: ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ‘ఫౌజీ’ పోస్టర్ అరాచకం
Written by Skyc Media Editorial
checkFilm Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Share this story
Help others stay updated with verified breaking news and insights.










