© 2026 nimisham.in
మెగాస్టార్ చిరంజీవి అంటే అద్భుతమైన నటన, ఉర్రూతలూగించే డ్యాన్స్, అనితరసాధ్యమైన మాస్ ఇమేజ్‌తో పాటు అభిమానులకు ఇచ్చే అనుకోని సర్ప్రైజ్లు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా తన రాబోయే ప్రాజెక్టులకు సంబంధించిన కీలకమైన అప్డేట్లను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించకముందే సరదాగా బయటపెట్టడం ఆయనకు అలవాటు. దీంతో సినీ వర్గాలు, అభిమానులు దీనికి ప్రేమగా ‘చిరు లీక్స్’ అని పేరు పెట్టారు. చిరంజీవి ఏ ఈవెంట్‌కి వెళ్లినా ఆయన ఏ విషయాన్ని లీక్ చేస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దీంతో ‘చిరు లీక్స్’ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో తరుచూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్లో చిరంజీవి తన 158వ చిత్రం టైటిల్‌ను అనుకోకుండా లీక్ చేసి వార్తల్లో నిలిచారు.* నన్ను పెద్ద మనసుతో క్షమించండి... ఫిల్మ్ ఛాంబర్ వివాదంపై జానీ మాస్టర్ క్షమాపణకేఎస్ రవీంద్ర ( బాబీ కొల్లి ) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీకి ఇంకా టైటిల్ అనౌన్స్ చేయకపోవడంతో ప్రస్తుతానికి ‘ మెగా 158 ’ అనే వర్కింగ్ టైటిల్‌తోనే వార్తల్లో నిలుస్తోంది. ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్ వేదికగా లీక్‌ల గురించి ప్రస్తావన వచ్చిన సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో సంభాషణ సమయంలో చిరంజీవి కాస్త తొందరపడ్డారు. ‘టీజర్ మ్యూజిక్ వర్క్ పూర్తయిందా? చివరిలో ‘కదిరి’ అని టైటిల్ కార్డ్ వేశారా?" అని చిరంజీవి సరదాగా ప్రశ్నించారు. చిరు మాటలకి తమన్ తల పట్టుకోవడంతో ఈ భారీ ప్రాజెక్ట్ టైటిల్ ‘కదిరి’ అని అయి ఉంటుందని అందరికీ క్లారిటీ వచ్చింది.దీంతో సోషల్ మీడియా వేదికగా ‘చిరు లీక్స్’ హ్యాష్‌ట్యాగ్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అధికారిక ప్రకటనకు ముందే టైటిల్ రివీల్ కావడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ లీక్‌తో పాటు ఆగస్టు 22న తన బర్త్‌డే కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నట్లు కూడా చిరంజీవి వెల్లడించారు.* టికెట్ రేట్లు తగ్గితేనే థియేటర్లు హౌస్‌ఫుల్... నిర్మాతలకు కనువిప్పు కలిగించిన ప్రేక్షకుడుఈ చిత్రంలో చిరంజీవి సరసన సీనియర్ నటి ప్రియమణి హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ ప్రముఖ నటి రచితా రామ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ‘ఛాంపియన్’ చిత్రంతో మెప్పించిన మలయాళ బ్యూటీ అనస్వర రాజన్, చిరంజీవికి మేనకోడలు లేదా కూతురు పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు తమన్ సంగీతం అందిస్తున్నారు.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.