
Chiranjeevi Bobby Kolli Movie The Editing For The First Half Of The Mega158 Is Officially Finished Srk 74595
చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం షూటింగ్ 40 రోజులు పూర్తైంది. ఫస్ట్ హాఫ్ దాదాపు లాక్ కాగా, ఇంటర్వెల్ ఫైట్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనుంది.
చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం షూటింగ్ 40 రోజులు పూర్తైంది. ఫస్ట్ హాఫ్ దాదాపు లాక్ కాగా, ఇంటర్వెల్ ఫైట్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనుంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. చిరంజీవి సపోర్ట్‌తో టీమ్ అంతా ఒకే స్పీడ్‌తో పని చేస్తుండడంతో 40 రోజుల షూటింగ్ పూర్తయిందని చిత్ర నిర్మాత వెంకట్ కె నారాయణ చెప్పారు. ఇప్పటివరకూ ఫస్ట్ హాఫ్ దాదాపు లాక్ అయిందని, చిత్రీకరించిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని, ఇటీవల చిత్రీకరించిన ఇంటర్వెల్ ఫైట్ సినిమాలో ప్రధాన హైలైట్‌గా ఉంటుందని చిత్ర దర్శకుడు బాబీ చెప్పారు.
ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అనస్వర రాజన్ (Anaswara Rajan), నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు. భాను-నందు మాటలు రాస్తున్నారు.
