
© 2026 nimisham.in

సీరియస్ పాత్రలతో ప్రయాణం చేస్తున్న కామెడీ కింగ్ అల్లరి నరేశ్ చాలా కాలం తర్వాత తనదైన శైలిలో నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కింది. ఇందులో సురభి హీరోయిన్ గా నటించింది. రాశి సింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్ ఓ డ్యాన్స్ నెంబర్ లో మెరిశారు. ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిశోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. గత కొంతకాలంగా ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి ఇంటెన్స్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన నరేశ్, మళ్లీ కామెడీ జోనర్లో సినిమా చేయడంతో ఆయన అభిమానులు, సినీ ప్రియులలో ఆసక్తి నెలకొంది.ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. సెన్సార్ పనులు కూడా పూర్తి కావడంతో, థియేట్రికల్ రిలీజ్ కోసం చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సినిమాతో అల్లరి నరేశ్ తన మార్క్ కామెడీతో మరో విజయాన్ని అందుకుంటారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.