సినిమాల్లో అలియా భట్ లుక్ ఎంత నేచురల్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేకప్ ఉన్నా, లేకపోయినా ఆమె ఫ్రెష్ గ్లోయింగ్ స్కిన్ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే ఆ గ్లో వెనుక ఖరీదైన ట్రీట్మెంట్లు మాత్రమే కారణం అని అనుకుంటున్నారేమో. అయితే ఆ లుక్ కోసం కేవలం మేకప్‌పై ఆధారపడకుండా, రోజువారీ స్కిన్కేర్కు అలియా చాలా ప్రాధాన్యం ఇస్తుంది. అలియా తన స్కిన్‌కేర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ, రోజువారీ రొటీన్లో తనకు నచ్చిన కొన్ని ప్రాథమిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తుంది.తన యూట్యూబ్ వీడియోలో ఆమె స్వయంగా తన స్కిన్‌కేర్ రొటీన్‌ను షేర్ చేసుకుంది. బిజీ షెడ్యూల్, తక్కువ నిద్ర వంటి కారణాలతో చర్మంపై ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, దాన్ని క్రమంగా సంరక్షించుకోవడానికి ఆమె కొన్ని స్టెప్పులను పాటిస్తుంది. మరి అలియా భట్ తన వానిటీలో తప్పనిసరిగా ఉంచుకునే ఈ బ్యూటీ ఎసెన్షియల్స్ ఏవి? ఆమె స్కిన్‌కేర్ రొటీన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం..జేడ్ రోలర్‌తో ఫేస్ మసాజ్అలియా తన స్కిన్‌కేర్ రొటీన్‌ను జేడ్ రోలర్, స్కిన్ మసాజర్‌తో స్టార్ట్ చేస్తుంది. చెంపలు, దవడ ప్రాంతంలో జేడ్ రోలర్‌తో సన్నితంగా మసాజ్ చేస్తుంది. ఫేస్ మసాజ్ చేయడం వల్ల చర్మానికి ఫ్రెష్ లుక్ వస్తుంది. జేడ్ రోలర్ చర్మాన్ని టైట్‌గా చేస్తుంది, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చూసుకుంటుందని JCD అధ్యయనం పేర్కొంది. జేడ్ రోలర్‌ను ఉపయోగించేటప్పుడు ముఖంపై ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా సున్నితంగా మసాజ్ చేయాలి.కళ్ల చుట్టూ ఐ క్రీమ్ తన బిజీ షూటింగ్ షెడ్యూల్ కారణంగా నిద్ర తక్కువగా ఉండే సందర్భాల్లో కళ్ల కింద డార్క్ సర్కిల్స్ కనిపిస్తాయని అలియా చెప్పింది. అందుకే ఆమె ఐ క్రీమ్‌ను రొటీన్లో చేర్చుకుంది. కళ్ల చుట్టూ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి ఏ ఉత్పత్తినైనా మెల్లగా అప్లయ్ చేయడం మంచిది. అలాగేనియాసినామైడ్ సీరమ్అలియా రొటీన్లో మరో ముఖ్యమైన ప్రొడక్ట్ నియాసినామైడ్ ఉన్న సీరమ్. నియాసినామైడ్‌ను సాధారణంగా చర్మ బ్యారియర్‌ను మెరుగుపరచడం, చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అయితే ప్రతి ఒక్కరి చర్మానికి ఒకే ఉత్పత్తి సరిపోదు.మాయిశ్చరైజర్ మర్చిపోదుస్కిన్కేర్లో మాయిశ్చరైజింగ్ చాలా ముఖ్యమైన స్టేజ్ అని అలియా చెబుతుంది. షూటింగ్ సమయంలో ఎక్కువసేపు మేకప్‌లో ఉండాల్సి రావడంతో చర్మం పొడిబారకుండా ఉండేందుకు ఆమె మాయిశ్చరైజర్‌ను కచ్చితంగా అప్లై చేస్తుంది. ముఖంతో పాటు మెడ, చేతులకు కూడా మాయిశ్చరైజర్ రాసుకుంటుంది.సన్‌స్క్రీన్ తప్పనిసరిఅలియా రొటీన్లో ముఖ్యమైన స్టేజ్ సన్‌స్క్రీన్. ఆమె SPF 50 ఉన్న సన్ స్క్రీన్‌ను ఉపయోగిస్తుంది. ముఖం, మెడకు సన్‌స్క్రీన్ అప్లై చేసి ఆ తర్వాత మేకప్ చేసుకుంటుంది. సూర్యుడి UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం ముఖ్యం.అలియా భట్ స్కిన్‌కేర్ రొటీన్ చూస్తే ఎక్కువ ఉత్పత్తులు వాడటం కంటే, క్లెన్సింగ్, హైడ్రేషన్, మాయిశ్చరైజింగ్, సన్ ప్రొటెక్షన్ వంటి ప్రాథమిక దశలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే సెలబ్రిటీ ఉపయోగించే ఉత్పత్తులు అందరికీ సరిపోవాల్సిన అవసరం లేదు. మన చర్మ రకానికి సరిపోయే ఉత్పత్తులను ఎంచుకోవడం, కొత్త ఉత్పత్తులను జాగ్రత్తగా ప్రారంభించడం మంచిది.ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.





