© 2026 nimisham.in


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా చేసింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధిక, రవినా టాండన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. మరీ బ్లాక్ బస్టర్ టాక్ రానప్పటికీ డీసెంట్ టాక్ తో భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో ఎప్పటిలాగే సూర్య తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఇక మమితా బైజు తన క్యూట్ యాక్టింగ్ అండ్ ఎక్స్ ప్రెషన్స్ తో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక ఇదే సినిమాలో బాగా హైలైట్ అయిన పాత్రల్లో సంజయ్ విశ్వనాథ్ కొడుకు అభయ్ ఒకటి. సినిమాలో ఈ పిల్లాడు తన క్యూట్ నెస్, న్యాచురల్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అభయ్ అసలు పేరు చార్విక్. చాలా మంది ఈ అబ్బాయిని సెలబ్రిటీల పిల్లాడని అనుకుంటున్నారు. కానీ అదేమీ కాదు. ఈ బాబు కామన్ మ్యాన్ వాళ్ల అబ్బాయి అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో చార్విక్ ను తీసుకోవడం వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉందని వాళ్ల తల్లిదండ్రులు తెలిపారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కోసం 6 నెలల నుంచి ఏడాది వయసున్న పిల్లలు కావాలని మేకర్స్ క్యాస్టింగ్ కాల్ ప్రకటించారు. దీంతో చార్విక్ ను ఆడిషన్ కు తీసుకెళ్లాం. అక్కడ చాలా మంది పిల్లలు ఏడుస్తుండగా చార్విక్ మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. దీంతో అతని క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నవ్వు చూసి మేకర్స్ వెంటనే సెలెక్ట్ చేశారు

వరుసగా మూడు భారీ విజయాలు సాధించడంతో ఇప్పుడు వెంకీ అట్లూరితో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒక్క విజయం మనిషి జాతకాన్ని మార్చేస్తుంది. ఇక్కడ సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. విజయం మీ వైపు ఉంటే ఆటోమేటిక్‌గా డిమాండ్ మీ తలుపు తడుతుంది. సరిగ్గా ఇప్పుడు ఇదే ఫార్ములా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి విషయంలో నిజమవుతోంది.ధనుష్‌తో చేసిన 'సార్', దుల్కర్ సల్మాన్‌తో తీసిన 'లక్కీ భాస్కర్' చిత్రాలతో వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టిన వెంకీ(Venky atluri), తాజాగా బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం సృష్టించారు. కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సూర్య, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంతో హ్యాట్రిక్ సక్సెస్ సాధించారు. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తోంది. వరుసగా మూడు భారీ విజయాలు సాధించడంతో ఇప్పుడు వెంకీ అట్లూరితో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. అయితే వెంకీ మాత్రం తన తరువాతి చిత్రాన్ని ఒక ప్రత్యేకమైన అక్కినేని హీరోతో చేసే ప్లానింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు... అక్కినేని నాగ చైతన్య. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, నాగ చైతన్య కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 25వ మైల్స్టోన్ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించబోతున్నారట. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న వెంకీతో తన 25వ సినిమాను పట్టాలెక్కించేందుకు నాగ చైతన్య కూడా చాలా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అసలు వీరిద్దరి కాంబినేషన్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నాగ చైతన్య, వెంకీ అట్లూరి మధ్య కేవలం ప్రొఫెషనల్ సంబంధమే కాకుండా మంచి స్నేహం, అనుబంధం ఉన్నాయి. వెంకీ అట్లూరి దర్శకుడిగా మారినప్పటి నుంచి తాను

పై ఫొటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు ఫేమస్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోంది. ఎంతలా అంటే ఇప్పుడీ హీరోయిన్ సినిమా చేస్తే సూపర్ హిట్ అన్న విధంగా మారిపోయింది. ఆ హిట్ అవుతోన్న సినిమాలు కూడా వందల కోట్ల కలెక్షన్లు రాబడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణాదిలోనే ది మోస్ట్ లక్కీ ఛార్మ్ గా మారిపోయిందీ క్రేజీ హీరోయిన్. కేరళ రాష్ట్రం ,కొట్టాయం సమీపంలోని కిడంగూర్ అని గ్రామానికి చెందిన ఈ చిన్నది ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చిన్నతనంలోనే తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అయితే డిగ్రీ పూర్తి చేయకుండానే హీరోయిన్ గా మళ్లీ సినిమాల్లో అడుగు పెట్టింది. 2017 నుంచే సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ రెండేళ్ల క్రితమే తెలుగుతెరకు పరిచయమైంది. కేవలం డబ్బింగ్ చిత్రాలు మాత్రమే చేస్తున్నా తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార. ముఖ్యంగా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారు హృదయాలు కొల్లగొడుతోందీ అందాల తార. అలాగే తన అభినయంతో చాలా మందికి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడీ హీరోయిన్ పేరు మళ్లీ మార్మోగుతోంది. లేటెస్ట్ గా ఆమె నటించిన ఒక సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. ఆమె మరెవరో కాదు ప్రేమలు సినిమతో పలకరించి ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో తన అల్లరితో ఆకట్టుకున్న మమితా బైజు. ప్రేమలు తర్వాత జీవీ ప్రకాశ్ కుమార్ తో రెబెల్ సినిమాలో చేసింది మమితా బైజు. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా మమితా యాక్టింగ్ కు అందరూ ఫిదా అయ్యారు. దీని తర్వాత ప్రదీప్ రంగనాథన్ తో కలిసి డ్యూడ్, ధనుష్ తో కలిసి కర అనే సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ ముద్దుగుమ్మ. ఈ సినిమాలన్నీ

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya), డైరెక్టర్ వెంకీ అట్లూరి(venky Atluri)పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విశ్వనాథ్ & సన్స్(Vishwanath & Sons) ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన, లక్కీ భాస్కర్(Lucky Baskhar) సినిమా చూసిన తర్వాత వెంకీ అట్లూరితో తప్పకుండా వర్క్ చేయాలని తాను డిసైడ్ అయినట్టు వెల్లడించారు. డైరెక్టర్ వర్క్ తనను ఎంతగా ఆకట్టుకుందో సూర్య మాటల్లో స్పష్టంగా కనిపించింది. లక్కీ భాస్కర్ తర్వాత ఆయన ఏ స్క్రిప్ట్ తీసుకొచ్చినా ఓకే చెప్పాలని డిసైడ్ చేసుకున్నానని, ఎందుకంటే ఆయనతో వర్క్ చేయాలని తాను మానిఫెస్ట్ చేస్తున్నానని, తర్వాత ప్రొడ్యూసర్ వంశీ(naga vamsi) నుంచి ఫోన్ వచ్చిందని, వంశీ గారు ఫోన్ చేసి వెంకీ గారి డేట్స్ ఉన్నాయని చెప్పారని, కానీ మొదట అనుకున్నది పూర్తిగా వేరే బయోపిక్ కథ అని సూర్య అన్నారు. ఈ కామెంట్స్ వెంకీ అట్లూరిపై ఆయనకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. స్టార్ హీరోలు సాధారణంగా కథ, పాత్ర, మార్కెట్ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే ఒక ప్రాజెక్ట్‌కు అంగీకరిస్తారు. అలాంటి సమయంలో కథ వినకముందే డైరెక్టర్ తర్వాతి స్క్రిప్ట్‌కు ఓకే చెప్పాలనుకున్నానని సూర్య చెప్పడం విశేషంగా మారింది. ఇదే సందర్భంలో ఆయన ప్రస్తావించిన వెంకీ డేట్స్, బయోపిక్ కథ అంశం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది

లేటెస్ట్ గా థియేటర్స్ లో అలరించడానికి వచ్చేస్తున్న అవైటెడ్ చిత్రమే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన అవైటెడ్ క్లీన్ ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రమే ఇది. అయితే మేకర్స్ ఒరిజినల్ తమిళ్ సహా డబ్బింగ్ తెలుగు భాషల్లో ఈ ఆగష్టు 14న గ్రాండ్ గా విడుదలకి తీసుకొస్తుండగా అభిమానులు ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా పట్ల మేకర్స్ బాగానే నమ్మకంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ ఇదే కాంబినేషన్ లో వచ్చిన గత హిట్ సినిమాలు వాథి/సార్ అలాగే లక్కీ భాస్కర్ ల తరహా కాన్ఫిడెన్స్ లేదా అనిపిస్తుంది. ముందు రెండు సినిమాలకి మేకర్స్ ఓ రోజు ముందే తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా పైడ్ ప్రీమియర్స్ ని సెట్ చేసి మరీ హిట్ కొట్టారు. కానీ సూర్య సినిమా విషయంలో మాత్రం ఈ రిస్క్ తీసుకోకూడదు అనుకున్నారా? లేక ఆ రేంజ్ కాన్ఫిడెన్స్ లేదా అనేది వారికే తెలియాలి. సో ఈ సినిమా రిజల్ట్ ఏంటి అనేది తెలియాలి అంటే ఈ 14 వరకు ఆగాల్సిందే

సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో కథానాయకుడు సూర్య మాట్లాడుతూ.. “ఈ వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే నవీన్ గారికి, మా సినీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ధన్యవాదాలు. అలాగే, రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న నా అభిమానులు, వారి కుటుంబ సభ్యులకు నా నమస్కారం. 28 ఏళ్ళ నుంచి మీరు నాపై ఈ ప్రేమను చూపిస్తున్నారు. మీ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను. నాగవంశీ గారు, వెంకీ వల్లే ఇలాంటి మంచి సినిమా సాధ్యమైంది. ఈ సినిమాను మీరు థియేటర్లలో చూసి ఖచ్చితంగా ప్రేమిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమాకు ప్రారంభం నుంచి త్రివిక్రమ్ గారి ఆశీస్సులు ఉన్నాయి. ఆయన మాకు ఎప్పుడూ అండగా ఉన్నారు. త్రివిక్రమ్ గారు కుటుంబ విలువలతో కూడిన మంచి సినిమాలను, ఈ జనరేషన్ మెచ్చేలా అందించారు. త్రివిక్రమ్ గారిని వెంకీ స్ఫూర్తిగా తీసుకున్నారు. జీవీ ప్రకాష్ అద్భుతమైన సంగీతం అందించారు. వెంకీ, జీవీ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ అవుతుంది. డీఓపీ నిమిష్, ఆర్ట్ డైరెక్టర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ ఇలా ప్రతి ఒక్కరూ సినిమా అద్భుతంగా రావడానికి కారణమయ్యారు. ఈ సినిమా కోసం నేను హైదరాబాద్ లో ఉన్న ఆరు నెలలను అసలు మరచిపోలేను. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. 20 ఏళ్ల క్రితం గజినీ సినిమాలో నన్ను సంజయ్ రామస్వామిగా ఆదరించారు. అదే మ్యాజిక్ ని తీసుకురావాలని వెంకీ, వంశీ అనుకున్నారు. రాధిక గారి వల్ల