© 2026 nimisham.in


‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE2) నుంచి అభిమానులను ఉత్సాహపరిచే అప్డేట్ వచ్చింది. టాలీవుడ్లో కల్ట్ క్లాసిక్ బడ్డీ కామెడీగా గుర్తింపు పొందిన ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindi 2) చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE2) నుంచి అభిమానులను ఉత్సాహపరిచే అప్డేట్ వచ్చింది. యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ ఫ్రాంచైజీ రెండో భాగం షూటింగ్ విజయవంతంగా పూర్తయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా.. సినిమా టీమ్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్లో “One Side Done” అంటూ షూటింగ్‌లోని ఒక ప్రధాన భాగం పూర్తయిందని వెల్లడించారు. అదే సమయంలో “Other Side – November 19” అంటూ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. దీంతో ‘ఈఎన్ఈ’ గ్యాంగ్ మరోసారి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేందుకు సిద్ధమవుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ (Vishwak Sen), అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, సాయినాథ్ మాగంటి తమ పాత పాత్రలతోనే మరోసారి సందడి చేయనున్నారు. మొదటి భాగంలో స్నేహం, హాస్యం, జీవితంలోని సరదా క్షణాలను సహజంగా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ గ్యాంగ్ ఇప్పుడు మరింత ఎంటర్టైన్మెంట్తో రాబోతోందని సినీ వర్గాలు ఇప్పటికే చెబుతూ వస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నవంబర్ 19న విడుదల కానున్న ఈ సినిమా యూత్ ఆడియన్స్‌కు మరో ఫన్ రైడ్‌గా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చి యూత్‌ను విశేషంగా ఆకట్టుకున్న క్లాసిక్ బడ్డీ కామేడీ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌కు రంగం సిద్ధమైంది. ‘ENE రిపీట్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న ఈ రెండవ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ హంగులు మరియు ఊహించని సర్ప్రైజ్లతో ఈ చిత్రం అలరించబోతోంది. విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ పనులకు సరిపడా సమయం కేటాయించేందుకు చిత్రబృందం పక్కా ప్లానింగ్‌తో ముందే పనులు పూర్తి చేసింది. ఈ సీక్వెల్లో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను తిరిగి తమ ఐకానిక్ పాత్రల్లో మెరవనుండగా, సుశాంత్ స్థానంలో శ్రీనాథ్ మాగంటి కొత్తగా చేరారు. సృజన్ యర్రబోలు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ మళ్ళీ తన మార్క్ మ్యూజిక్‌తో సందడి చేయనున్నారు. యూత్ అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి రచ్చ చేయడానికి సిద్ధంగా ఉంది