© 2026 nimisham.in


అనుకోకుండా జరిగే ఓ ఘటన కొన్ని సందర్భాల్లో మనతో పాటు మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లోనూ అనుకోని పరిణామాలు చోటు చేసుకోవటానికి కారణమవుతాయి. అలాంటి ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, కశ్యప్, రాజారవీంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మేఘాలయా రాష్ట్రంలో పూర్తిగా చిత్రీకరణను జరుపుకున్న తొలి దక్షిణాది సినిమా ఇదే కావటం విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. టీజర్‌ను గమనిస్తే సినిమాలో పాత్రలను పరిచయం చేస్తూ అవెలా ప్రవర్తిస్తాయనే విషయాన్ని రివీల్ చేశారు. సినిమా కథనంలో ఓ వేగం కనిపిస్తూనే ఎంటర్టైనింగ్గానూ సినిమా ఉంటుందనేది స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో .. తాజాగా మేకర్స్ ఈ సినిమాను దసరా సందర్బంగా అక్టోబర్ 9న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అలాగే ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ రిలీజ్ చేయటం విశేషం. సాంగ్ యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉందని, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని దేవిశ్రీప్రసాద్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. ‘ఆజా మేరీ జాని’ సాంగ్ విషయానికి వస్తే..ఇదొక పార్టీ సాంగ్. ప్రధానంగా అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్ లపై ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను కలర్ఫుల్గా చిత్రీకరించారు. ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్(ఆర్కాడొ) సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రాయగా..బెన్నీ దయాల్ పాడారు. పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేంత జోష్‌గా ఉంది. ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ

గుణి మంచికంటి దర్శకత్వంలో వేణు దోనేపూడి నిర్మిస్తున్న 'బా బా బ్లాక్ షీప్' మూవీ అక్టోబర్ 9న విడుదల కాబోతోంది. ఇప్పటికే సినిమా టీజర్ విడుదల కాగా ఆగస్ట్ 14న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. ఒక రోజు జరిగిన అనుకోని ఘటనతో ఆరుగురు వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే వైవిధ్యమైన కథాంశంతో రూపుదిద్దుకుంటోంది 'బా బా బ్లాక్ షీప్'. ఈ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీని దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, కశ్యప్, రాజా రవీంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. దాంతో మూవీపై ఆసక్తి పెరిగింది. ఓ బాక్స్, గన్ చుట్టూ కథంతా తిరుగుతుందని ఆ టీజర్ చూస్తే అర్థమౌతోంది. తాజా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 9న దసరాకి కాస్తంత ముందే ఈ సినిమాను జనం ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ, 'సినిమా మొత్తాన్ని మేఘాలయా రాష్ట్రంలో లోనే పూర్తి చేశాం. చిరపుంజి వంటి అద్భుతమైన లొకేషన్స్‌లోనూ చిత్రీకరించాం. మేఘాలయాలో మొత్తం సినిమా షూటింగ్ జరుపుకున్న తొలి సినిమా మాదే. అతి తక్కువ రోజుల్లోనే పక్కా ప్లానింగ్‌తో సినిమాను కంప్లీట్ చేశాం. మా డైరెక్టర్ గుణి, నటీనటులు, సాంకేతిక నిపుణులు సహా ఎంటైర్ టీమ్ సహకారంతో ఇది సాధ్యమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4.14కు విడుదల చేయబోతున్నాం. 'ఆజా మేరీ జానీ' అనే హై ఎనర్జిటిక్ సాంగ్‌కు స్టీఫెన్, ఆనంద్ స్వరాలు అందించారు' అని తెలిపారు. ‘ఇప్పుడేం