© 2026 nimisham.in


Bhimavaram: పవన్ కళ్యాణ్ జన్మదిన బైక్ ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు! Bhimavaram: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవర్ కారిడార్లలో డిప్యూటీ సీఎం అనే పదవికి సరికొత్త గ్లామర్, బ్రాండ్ ఇమేజ్ ను తెచ్చిపెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం భీమవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విస్సాకోడెరు వంతెన దగ్గర జియో పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఉండి రోడ్డులోని మల్టీప్లెక్స్ ఎమ్మెల్యే కార్యాలయం వరకు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలతో బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ కేవలం ఒక హోదాగా పరిమితం కాకుండా ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించే సేవకుడిగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పాలనందిస్తున్నారని అన్నారు. సినిమా పరిశ్రమ నుండి ప్రజా నాయకుడిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. ప్రజాదరణ పొందిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని, సమాజ సేవలో నిరంతరం కొనసాగాలని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని అన్నారు. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారని, గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయన్నారు. అనంతరం జియో పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఓవర్ బ్రిడ్జి, బుధవారం మార్కెట్ రోడ్, పోలీస్ బొమ్మ సెంటర్, ప్రకాశం చౌక్, అంబేడ్కర్ సెంటర్, బాంబే స్వీట్స్ సెంటర్, ఉండి రోడ్డు మీదుగా ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మూల్యాంకనంతో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు అర్హులను బలి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 మూల్యాంకనంతో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు అర్హులను బలి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు ఇవాళ (గురువారం) మధ్యాహ్నం లంచ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్-1 అంశం చర్చకు వచ్చింది. గ్రూప్-1 మూల్యాంకనంలో 97 శాతం జవాబు పత్రాలు దిద్ది ఉండటంపై సీఎం చంద్రబాబు, మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లతో జవాబు పత్రాలు దిద్దించడంపై పలు పత్రికలు, ఛానళ్లలో వచ్చిన వార్తలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారని సీఎంకు మంత్రులు వివరించారు. ఈ సందర్భంగా త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ గ్రూప్-1 వ్యవహారంపై వైసీపీని ఎండగట్టాలని సీఎంను కోరారు. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా గత వైసీపీ ప్రభుత్వం, అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు పాత్రపై మరింత లోతైన దర్యాప్తు చేయాలని మంత్రులు పేర్కొన్నారు. మరికొంతమంది అధికారుల పాత్రా ఉందని, దీనిపైనా దర్యాప్తు జరపాలని చంద్రబాబుకు మంత్రులు విజ్ఞప్తి చేశారు. 2011లో మహారాష్ట్రలోనూ ఇలానే జరిగితే అక్కడ అభ్యర్థులు పోరాటం చేశారని మంత్రులు గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. సిట్ నివేదిక కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం నిర్ణయం ఏమిటో చూద్దామని మంత్రులకు సూచించారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపై సమాచారం సేకరించేందుకు కొంతమంది పోలీస్ శాఖ అధికారులకు ప్రభుత్వం టాస్క్ ఇచ్చిందన్నారు. తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లిన గ్రూప్-1 అభ్యర్థులతో మాట్లాడితే పూర్తి సమాచారం వస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు

Shaligouraram: గర్భిణీలకు పోషకాహారం పంపిణీ చేసిన లయన్స్ క్లబ్ శాలిగౌరారం: శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ శాలిగౌరారం ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు పోషకాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు, గురజాల గ్రామానికి చెందిన దాతలు చామల లతారెడ్డి - రామచంద్రారెడ్డి దంపతుల సహకారంతో ఈ పోషకాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు నిమ్మల ఆంజనేయులు మాట్లాడుతూ గర్భిణీలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. సమాజంలో అవసరమైన వారికి సేవ చేయడమే లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో చార్టెడ్ ప్రెసిడెంట్, డీసి మెంబర్ బుడిగె శ్రీనివాసులు, జోన్ చైర్మన్ డెంకల సత్యనారాయణ, రెండవ ఉపాధ్యక్షులు వడ్లకొండ బిక్షం, దునక వెంకన్న, మండల వైద్యాధికారి డాక్టర్ శిల్ప, సూపర్వైజర్ మరియమ్మ, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, వివిధ గ్రామాల గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు. గర్భిణీ మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ పోషకాహారం అందించిన లయన్స్ క్లబ్ సభ్యులు, దాతలను పలువురు అభినందించారు

ఏపీలో ఎస్పీల బదిలీ, పోస్టింగ్లను చేస్తూ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (NC)గా ఎన్.వి. రామాంజనేయులను తక్షణమే బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఏపీలో ఎస్పీల బదిలీ, పోస్టింగ్లను చేస్తూ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (NC)గా ఎన్.వి. రామాంజనేయులను తక్షణమే బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం SP (NC), వెయిటింగ్లో ఎన్.వి. రామాంజనేయులు ఉన్నారు. ఆయనను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో SP (NC)/RV&EOగా నియమించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులో రామాంజనేయులుకు పోస్టింగ్ ఇచ్చారు. రామాంజనేయులను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలో ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏపీ హోంశాఖ ఆధ్వర్యంలో జీవో ఆర్టీ నంబర్- 994 ద్వారా జి. విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్నినో వేళ పంటలకు పట్టిసీమ నీరే జీవాధారం: సీఎం చంద్రబాబు అరాచకాలు, అక్రమాలు చేసే వైసీపీ కనుమరుగైపోయింది: మంత్రి డీబీవీ స్వామి శ్రీశైల మల్లన్న భక్తులకు అలర్ట్.. ఆ సేవలు నిలిపివేత